WHAT'S NEW?
Loading...

కంప్యూటర్ లేదా usb drive లో Delete అయిన డేటా ని తిరిగి పొందండిలా

కంప్యూటర్ లో డేటా ని పొరపాటున డిలీట్ చేసారా ? Recycle Bin నుండి కూడా డేటా / ఫైల్స్ ని తొలగించేసారా ? USB Drive నుండి డిలీట్ అయిన డేటా తిరిగి పొందాలనుకొంటున్నరా ? కెమెరా లో ఎంతో ఇష్టపడి తీసుకొన్న ఫోటో లు పొరపాటున డిలీట్ చేస్తే ... డేటా పోయిందని బాదపదవలసిన అవసరం లేదిక ...వీటన్నిటికి పరిష్కారం వుంది , EaseUS Data Recovery Wizard ని మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకొని పొరబాటున డిలీట్ చేసిన విలువయిన డేటా ని తిరిగి పొందవచ్చు . 


 ఈ Utility డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రింది లింక్ పైన క్లిక్ చేయండి .


1. Recycle Bin నుండి డిలీట్ చేసిన డేటా recover చేయడానికి Delete File Recovery ఆప్షన్ ని ఎంచుకోవాలి.  
2. System Crash , Software Crash మరియు Format చేసినపుడు, Complete ఆప్షన్ ని ఎంచుకోవాలి . 
3. System Partitions మరియు USB drives నుండి డేటా ని తిరిగి పొందాలంటే Partition Recovery ఆప్షన్ ని ఎంచుకోవాలి . 

Example : USB డ్రైవ్ నుండి డేటా రికవరీ చేయాలంటే usb డ్రైవ్ ని connect చేసి software ని ఓపెన్ చేసి System Partitions పైన క్లిక్ చేయాలి 

Next వచ్చె విండో లో ఏ type ఫైల్ ని Recovery చేయాలో ఎంచుకొని Next పైన క్లిక్  చేయాలి 


USB Drive ని ఎంచుకొని Next పైన క్లిక్ చేయాలి


డేటా ని USB డ్రైవ్ లో సెర్చ్ చేసుకొంటుంది . 

Recovery చేయవలసిన ఫైల్ ని select చేసుకొని Recovery button పైన క్లిక్ చేయాలి 


 తర్వాత వచ్చె విండో లో ఎక్కడ సేవ్ చేయాలోLocation ఇస్తే సరిపోతుంది , Location లో ఒక Folder create చేయబడి దానిలో recovery చేయాలనుకొన్న ఫైల్స్ సేవ్ చేయబడుతాయి .


గమనిక : 1GB వరకు support చేస్తుంది , అంతకన్నా ఎక్కువ డేటా Recover చేయాలంటే purchase చేయాల్సిందే .  

Post a Comment