WHAT'S NEW?
Loading...

తెలుగు నిఘంటువు - Telugu Dictionary


"దేశ భాష లందు తెలుగు లెస్స "  

మన తెలుగు భాష ఎంత గొప్పది కాకపోతే ... బ్రౌన్ దొర లాంటి పరదెశీయులు సైతం మన తెలుగు పై మక్కువ పెంచుకొని , తెలుగు భాష పై ఎన్నో పరిశోదనలు చేసి మరీ మనకు అద్బుతమయిన తెలుగు నిఘంటువు ని అందించారు . వారే కాదు మన తెలుగు పరిశోదకులు ఎందరో మహానుబావులు  తెలుగు భాష అబివృద్ది కి ఎంతో కృషి చేస్తున్నారు . 

మారుతున్న కాలానికి అనుగుణం గా మనం కూడా మారాలి కదా ? :) అలా అని మన తెలుగు సంస్కృతి ని సాంప్రదాయాలను మార్చమని కాదు సుమా ... కంప్యూటర్ , ఇంటర్ నెట్ అబివృద్ది చెందుతున్న ఈ రోజుల్లో ఇప్పటి యువత ఇంటర్ నెట్ పైనే జీవితాన్ని గడిపెస్తున్నారు  కదా , ఇలాంటి వారికోసం ఆన్లైన్ లో కూడా డిక్షనరీ వుంటే బావుండును అనుకోని మన " ఆంద్రభారతి.com " వాళ్ళు ఒక అద్బుతమయిన తెలుగు నిఘంటువు మనకు అందించారు . 

ఈ అద్బుతమయిన ఆన్లైన్ నిఘంటువు కు అనేక తెలుగు నిఘంటువులను  అనుసందానము చేసారు , మనము కావలసిన పదము అర్దము ను అన్ని నిఘంటువుల నుండి సోదించి మనకు అర్ధం ఇవ్వబడుతుంది , ఇక ఎందుకు ఆలస్యం మీకు కావలసిన అర్ధాలను ( English - తెలుగు / తెలుగు - తెలుగు ) తెలుసు కొండి . 

ఈ క్రింది తెలుగు నిఘంటువు లింకు క్లిక్ చేయడం ద్వారా సంబందిత వెబ్ పేజి దర్శించండి . 


Post a Comment