WHAT'S NEW?
Loading...

ఫోటోషాప్ నేర్చుకొందాము 7 - ఫోటోషాప్ బేసిక్స్ - Tool Bar -2


ఫోటోషాప్ నేర్చుకొందాము 6 - ఫోటోషాప్ బేసిక్స్ - Tool Bar -1 లో Selection Tool లో Move మరియు Lasso టూల్స్ గురించి తెలుసుకొన్నాము , ఈ పోస్ట్ లో మరికొన్ని టూల్స్ గురించి తెలుసుకొందాము ... 

Magic Wand Tool (W) :  Image లో ఒకే రంగులో వుండే Part ని సెలెక్ట్ చేయడానికి ఈ టూల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది . ఈ టూల్ ని సెలెక్ట్ చేసి ఇమేజ్ పైన క్లిక్ చేస్తే , ఇమేజ్ యొక్క కలర్ మరియి Pixel ఆదారంగా సెలెక్ట్  చేయబడుతుంది . కొన్ని సమయాల్లో కొంచెం difference వున్న కలర్స్ ని సెలెక్ట్ చేయడం కష్టమవుతుంది ( ఉదా : red కలర్ లో లైట్ red వుంటే , dark రెడ్ కలర్ మాత్రమే సెలెక్ట్ చేయబడుతుంది , Light కలర్ Red కాకపోవచ్చు) , అటువంటి situation లో Tolerance ఆప్షన్ చక్కగా ఉపయోగ పడుతుంది . 

Tolerance ఆప్షన్ ఇమేజ్ యొక్క Brightness Level range ఆదారంగా వుంటుంది , దీనిని range 0 - 255
Default విలువ 34 , 255 అంటే మొత్తం ఇమేజ్ సెలెక్ట్ చేయబడుతుంది . selection కి అనుగుణంగా Value ని మార్చుకొనవచ్చు . 

టూల్ ని సెలెక్ట్ చేసి ఇమేజ్ పైన క్లిక్ చేస్తే చాలు , పైన ఇమేజ్ లో Red Arrow గమనించండి. White ఏరియా సెలెక్ట్ చేయబడింది , Yellow arrow ని గమనించండి .. లోపల వున్న white ఏరియా కూడా ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే Shift కీ ప్రెస్ చేసివుంచి , లోపల వున్న Area లో క్లిక్ చేస్తే , ఒకేసారి లోపల ఏరియా కూడా సెలెక్ట్ చేయబడింది . సెలెక్ట్ చేసుకొన్నా ఏరియా Remove చేయాలంటే ctrl + x చేస్తే సరిపోతుంది . అదేవిధం గా లోపల వున్నా ఇమేజ్ (kid) మాత్రం కావాలంటే , సెలెక్ట్ అయ్యాక మౌస్ తో ఇమేజ్ పైన Right Click చేసి select inverse ఆప్షన్ సెలెక్ట్ చేస్తే లోపల ఏరియా మాత్రమె సెలెక్ట్ చేయబడుతుంది , తర్వాతా ఆ ఏరియా మాత్రమె copy / Cut చేసుకోవచ్చు . 

Quick Selection Tool (w) : Image లో కావలసిన బాగాన్ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగించే టూల్స్ లో చాలా అద్బుతమయిన , సులభం గా ఉపయోగించడానికి వీలుపడే టూల్ ఇది.  

టూల్ బార్ నుండి టూల్ ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ పైన కావలసిన బాగాన్ని మౌస్ క్లిక్ పట్టుకొని వుంచి సెలెక్ట్ చేసుకొంటూ పోతే సరిపోతుంది . ఈ టూల్ ని ఉపయోగించడానికి 3 రకాలయిన options లబ్యమవుతాయి . 

1. New Selection ఆప్షన్ : ఇది default గా వుంటుంది .
2. Add to selection : selection చేసిన బాగానికి ఇంకా కొంత బాగాన్ని చేర్చాలంటే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది .
3. selection చేసిన బాగము నుండి  కొంత బాగాని తీసివేయాలంటే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది .
4. Brush settings లోBrush సైజు , Hardness మరియు spacing ఒప్షన్స్ కలిగివుంటాయి ( ఈ ఆప్షన్స్ తర్వాతి పోస్ట్ లలో ప్రాక్టికల్ గా చేద్దాము )
5. మన ఇమేజ్ లో చాలా Layers వున్నప్పుడు సెలక్షన్ అన్ని layers నుండి చేయాలనుకోన్నప్పుడు ఈ ఆప్షన్స్ ని వుపయోగిన్చుకోవాలి .

Crop Tool (C) : Image లో కొంతబాగాన్ని fixed గా సెలెక్ట్ చేసి మిగిలిన బాగాన్ని తొలగించడానికి ఈ టూల్ ఉపయోగిస్తాము . ఈ టూల్ ని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ పైన rectangle గా మౌస్ తో drag చేసి మౌస్ క్లిక్ ని వదిలిపెట్టి Enter కీ press చేస్తే చాలు , సెలెక్ట్ చేసుకొన్నా Part వదిలి మిగిలిన బాగము Crop చేయబడుతుంది . సెలక్షన్ చేసి మౌస్ క్లిక్ వదిలి నపుడు 9 బాగాలుగా ఇమేజ్ Devide చేయబడుతుంది , ఇమేజ్ selection ని re size కూడా చెసుకొవచ్చు.

Perspective Crop Tool (C) :
ఈ టూల్ కూడా crop టూల్ వలే పనిచేస్తుంది , దీనిలో Rectangle shape వలె  సెలక్షన్ కాకుండా, ఇమేజ్ లోని Corners (అంచులను ) ని Move చేసుకొనే వీలువుంది .  (పక్కన వున్నా ఇమేజ్ ని గమనించండి )

ఇలా selection అయ్యాక మౌస్ క్లిక్ ని వదిలిపెట్టి Enter కీ press చేస్తే చాలు , సెలెక్ట్ చేసుకొన్నా Part వదిలి మిగిలిన బాగము Crop చేయబడుతుంది .

తర్వాతి పోస్ట్ లలో మరికొన్ని ఆసక్తి కరమయిన టూల్స్ గురించి వివరం గా తెలుసుకొందాము .

ఈ పోస్ట్ పైన మీ కామెంట్ తప్పక తెలియజేయండి ... మీకు ఏమైనా సందేహాలు వుంటే techwavetutorials@gmail.com కి మెయిల్ చేయండి , ఈ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా పంపండి . 

Post a Comment