WHAT'S NEW?
Loading...

ఫోటోషాప్ నేర్చుకొందాము 8 - ఫోటోషాప్ బేసిక్స్ - Tool Bar -3




ఈ పోస్ట్ లో ఫోటోషాప్ మరికొన్ని ముఖ్యమయిన టూల్స్ గురించి చూద్దాము ...

Eyedropper Tool  (I) : ఈ టూల్ ని వుపయోగించి మన దగ్గరున్న ఇమేజ్ లో వున్నా కలర్ ని సెలెక్ట్ చేసుకొని , ఆ కలర్ ని వేరే ఇమేజ్ లో ఉపయోగించుకోవచ్చు .

టూల్ బార్ నుండి Eyedropper Tool ని సెలెక్ట్ చేసుకొని,  ఇమేజ్ లో మనకు కావలసిన కలర్ Foreground / Background లో ఎంచుకొని ఇమేజ్ లో కలర్  పైన క్లిక్ చేసుకొంటె,Foreground / Background లో మనం సెలెక్ట్ చేసుకొన్న కలర్ వచేస్తుంది , తర్వాత ఆ కలర్ ని మనకు ఎక్కడ కావాలో అక్కడ ఉపయోగించుకోవచ్చు .

ఇమేజ్ లో గమనించండి Foreground లో బ్లూ కలర్ , Background లో గ్రీన్ కలర్ ఇమేజ్ నుండి సెలెక్ట్ చేయబడింది .


Patch Tool (J) : Image కు patch వర్క్ చేసేదానికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది . క్రింది ఇమేజ్ లో గమనించండి , Heart సింబల్ ని తొలగించి అదే ఇమేజ్ లో Clouds వున్నా పార్ట్ తో Patch చేయబడుంది .

టూల్ బార్ నుండిPatch Tool ని సెలెక్ట్ చేసుకొని,  ఇమేజ్ లో ఏ బాగాన్ని Patch చేయాలో , ఏ బాగం తో చేయాలో చూసుకొని , టూల్ తో Patch చేయాల్సిన పార్ట్ చుట్టూ డ్రాగ్ చేసి , ఏ బాగం తో చేయాలో అక్కడకు సెలెక్ట్ చేసిన బాగాన్ని డ్రాగ్ చేసి వదిలితే సరిపోతుంది .

Clone stamp Tool (S) : ఈ టూల్ ఎలా పని చేస్తుందంటే , లెటర్స్ హెడ్స్ పైన స్టాంప్ ని ముద్రిస్తాము కదా, Ink లో అద్ది , డాక్యుమెంట్ లో ఎక్కడ స్టాంప్ వేయాలో అక్కడ వేసినట్లే .... ఈ టూల్ ఇమేజ్ లో ఒకచోట వున్న pixel ని (copy చేసి) మరోకచోటకితీసుకోవడానికి ఉపయోగపడుతుంది . Patch Tool మాదిరిగా ఈ టూల్ కూడా patch వర్క్ , ఇమేజ్ ని Retouch చేసేదానికి ఉపయోగిస్తారు ,

దీనిని ఉపయోగించడానికి ఈ టూల్ ని సెలెక్ట్ చేసి,  ఏ ఇమేజ్ నుండి ఏ పార్ట్  కావాలో అక్కడ మౌస్ Cursor వుంచి , keyboard లో ALT కీ ని press చేసి వుంచి మౌస్ క్లిక్ ఒక సారి చేయాలి. ఇప్పుడు ఎక్కడ అయితే ఇమేజ్ ని వేరే ఇమేజ్ పైన clone చేయాలో అక్కడ మౌస్ తో క్లిక్ ప్రెస్ చేసి వుంచి డ్రాగ్ చేసుకొంటే అక్కడ ఇమేజ్ క్లోన్ అవుతుంది .
Options లో ఎంత Opacity , Flow కావాలో సెట్ చేసుకొని ఇమేజ్ ని clone  చేసుకోవచ్చు .

ప్రక్కనవున్న ఇమేజ్ లో గమనించండి , ఇండియా మ్యాప్ లో మద్య లో వున్న అశోకచక్రాన్ని పక్కన ఇమేజ్ లో క్లోన్ చేయబడింది .

Smudge Tool : ఇమేజ్ లను soft గా చేయడానికి , ఇమేజ్ లను కట్ చేసినప్పుడు edge లను smooth చేయడానికి , ఇమేజ్ లను సహజం గా ఉండేలా చేయడానికి ఈ టూల్ చాలా బాగా ఉపయోగపడుతుంది .
 Smudge టూల్ ని సెలెక్ట్ చేసుకొని ,Options లో ఎంత Opacity , Flow కావాలో సెట్ చేసుకొని ఇమేజ్ ని లేక edges ని adjust చేసుకోవచ్చు. ప్రక్కన వున్న ఇమేజ్ గమనించండి , ఇమేజ్ 1 లో వున్నా ముడతలు , rough గా వున్న Face smooth ఎలా అయిందో గమనించండి .

Dodge Tool & Burn Tool (O): ఇమేజ్ ని dark (Burn Tool ) లేదా Lighten (Dodge Tool  ) చేసేదానికి ఈ టూల్స్ ని ఉపయోగిస్తారు . కావలసిన సైజు కి brush సైజు ని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేసి , ఇమేజ్ పైన మౌస్ క్లిక్ వుంచి drag చేస్తే సరిపోతుంది (పైన చెప్పిన టూల్స్ brush సైజు ని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేసి అవసరానికి తగినట్లు వుపయోగించుకొవచ్చు ) . Dodge Tool & Burn Tool ఉపయోగించి చేసిన ఇమేజ్ ని గమనించండి .
(Dodge Tool) ---------------------
(Burn Tool)






















ఇంతవరకు ముఖ్యమయిన టూల్స్ గురించి ఇవ్వడ జరిగింది . మిగిలిన టూల్స్ ని ఇమేజ్ లు Edit చేసేసమయం లో వివరం గా తెలుసుకొందాము . 


ఈ పోస్ట్ పైన మీ కామెంట్ తప్పక తెలియజేయండి ... మీకు ఏమైనా సందేహాలు వుంటే techwavetutorials@gmail.com కి మెయిల్ చేయండి , ఈ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా పంపండి . 

Post a Comment