WHAT'S NEW?
Loading...

బ్లాగు టెంప్లేట్ మరియు పోస్ట్ లు backup తీసిపెట్టుకోండి


బ్లాగు రాసేవాళ్ళకు ఈ పోస్ట్ ఉపయోగపడుతుంది . 

వెబ్సైటు లకు ప్రత్యామ్నాయం గా బ్లాగు లు ఎంతో ప్రాచూర్యం పొందుతున్నాయి . ఎంతో మంది తమ తమ అబిరుచులని , అబిప్రాయాలను తమ బ్లాగులలో పొందుబరుచుకొంటుంటారు . ఇలా రాసుకొన్న బ్లాగు ఎవరైనా Hack చేయడమో , లేదా పొరబాటున delete చేయడమో జరిగితే ... కస్టపడి రాసుకొన్న బ్లాగు ... ఇక రాదనుకొంటే ఎంతో బాదేస్తుంది కదూ ... ? అందుకే ఎప్పటికప్పుడు బ్లాగు టెంప్లేట్ ను , మరియు బ్లాగు లోని పోస్ట్ లను backup చేసుపెట్టుకొంటే , ఎవరు Hack చేసినా లేదా పొరబాటున delete అయినా పర్వాలేదు , మరలా అదే బ్లాగు టెంప్లేట్ ను మరియు బ్లాగు లోని పోస్ట్ లను ముందులాగే యదాతదం గా చేసుకోవచ్చు ... 

blogger లో బ్లాగు టెంప్లేట్ మరియు పోస్ట్ లు backup ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం ...

 బ్లాగు టెంప్లేట్ backup :

Image 1 

blogger లోకి లాగిన్ అయిన తర్వాత , ఏ బ్లాగు ని అయితే backup తీసుకోవాలో , ఆ బ్లాగుని select చేసుకొని ... తర్వాత వచ్చే స్క్రీన్ లో template ఆప్షన్  (Image 1) పైన క్లిక్ చేయాలి .

తర్వాత స్క్రీన్ (Image 2) లో చూపించిన విదం గా  Backup / Restore పైన క్లిక్ చేస్తే వచ్చే విండో (Image ౩) నుండి Download full template  క్లిక్ చేస్తే టెంప్లేట్ డౌన్లోడ్ (.xml file గా )చేయబడుతుంది.

Image 2



అదేవిధంగా కొత్త లేక ఇంతకముందు backup తీసుకొన్న .xml file ని కొత్త బాగు లోకి చేర్చాలంటే Choose File క్లిక్ చేసి .xml file ni select చేసుకొని upload క్లిక్ చేస్తే సరిపోతుంది .

పోస్ట్ లు backup :

పోస్ట్ లు backup తీసుకోవాలంటే ...
settings పైన క్లిక్ చేసి వచ్చే ఆప్షన్స్ లో Other ని క్లిక్ చేసి ఎంచుకోవాలి ( పక్క Image చూడండి ).

తర్వాత Export blog క్లిక్ చేయాలి .

తర్వాత వచ్చే విండో లో Download Blog బటన్ ని క్ల్సిక్ చేయడం ద్వారా పోస్ట్ లను .xml file రూపం లో backup తీసుకోవచ్చు .
తర్వాత backup file ని కొత్త బ్లాగుకు చేర్చాలంటే Import బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా వచ్చే విండో కి ..xml file (backup తీసిపెట్టుకొన్న file ) ఇవ్వడం ద్వారా పోస్ట్ లను చేర్చవచ్చు.
మనకు బ్లాగ్ వద్దనుకొంటే , పూర్తిగా delete చేయాలంటే Delete బ్లాగ్ క్లిక్ చేయడం ద్వారా బ్లాగు ను delete చేయవచ్చు . 
బ్లాగు లను ఎలా create చేయాలో ఇది వరకటి పోస్ట్ లలో తెలుసుకొన్నాము ... క్రింది లింక్ లను క్లిక్ చేయడం ద్వారా ఆయా పోస్ట్ లను చూడవచ్చు .... 

Post a Comment