WHAT'S NEW?
Loading...

Facebook Security మరియు Privacy settings ల గురించి తెలుసుకొందాం ...


కొత్త పరిచయాలకి పునాదులను వేసేందుకు ఒక అద్బుతమయిన వారది గా ఉన్న ఫేస్‌బుక్ సోషల్ నెట్వర్క్ గురించి పరిచయం తో ప్రారంబిస్తూ ... ఫేస్‌బుక్ దుర్వినియోగాన్ని తగ్గించేందుకు చేయవలసిన Security మరియు Privacy Settings గురించి చూద్దాం ...

Facebook గురించి :


ఫేస్‌బుక్ సోషల్ నెట్వర్క్ సర్వీస్ ఫిబ్రవరి 2004లో ఆరంభించబడింది . ఫేస్‌బుక్ మొదట "దిఫేస్‌బుక్" పేరుతో  Harvard  స్టూడెంట్  మార్క్ జకర్‌బర్గ్ చే స్తాపించబడింది. ఫేస్‌బుక్ Headquarters Palo Alto, California, U.S. లో వుంది . 2013 Q3 రిజల్ట్స్ ప్రకారం $2.02 billion గా Revenue ని కలిగివుంది.ఫేస్‌బుక్ లో ఉద్యోగస్తుల సంఖ్య September 2013 నాటికి 5794.ఫేస్‌బుక్ 1.19 బిలియన్ monthly active user లను కలిగి వుంది , 874 million mobile user లను కలిగి వుంది.




Facebook ద్వారా :


ఫేస్‌బుక్ ద్వారా కొత్త స్నేహితులను కలవడమే కాకుండా , అనేక ప్రయోజనాలను పొందవచ్చు . 

మన ఇష్టాలను , మనలోని ఆలోచనలను , మన అబిరుచులను , మనకు నచ్చిన విషయాలను కామెంట్ ల రూపంలోనో , చిత్రాల రూపం లోనో లేక వీడియో ల రూపం లో మన స్నేహితులతో పంచుకోవచ్చు .



మనం ఏదైనా   బిజినెస్  ప్రారంబిస్తే ,  బిజినెస్ ని promote చేసుకొనేందుకు , ఒక మంచి మాద్యమం గా ఫేస్‌బుక్ ని (బిజినెస్ సంబంధించి పేజి మరియు గ్రూప్ లను సృష్టించి ) ఉపయోగించుకోవచ్చు . 



ఫేస్‌బుక్ లో Advertisement ని క్లిక్  ల ద్వారా మనకు కొత్త ఉత్పత్తుల సమాచారం తెలుసుకొనడమే కాకుండా .. మనకు నచ్చిన ఉత్పత్తులను ఆన్లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు .



ఇలా అనేక ప్రయోజనాలను facebook ద్వారా పొందవచ్చు .




Facebook దుర్వినియోగం:


ఫేస్‌బుక్ ద్వారా ప్రయోజనాలను పొందడం కన్నా కొంతమంది దానిని దుర్వినియోగం చేసేందుకే ఎక్కువ ఉపయోగిస్తున్నారు .. ఫేస్‌బుక్ లో ప్రొఫైల్ లో ఫోటోలను copy చేసుకొని వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీలం గా తయారు చేసి వాటిని మళ్ళీ facebook లో పోస్ట్ చేసి , ఆయా ఫోటో లను సంబందించిన వ్యక్తుల ఆత్మహత్య చేసుకొనేలా చేసిన సంగటనలు మనం రొజూ పేపర్ లోనో, టీవీ లోనో  చూస్తూనేవున్నాము ... 


ఇలాంటి సంగటనలు పూర్తిగా అరికట్టలేకపోయినా కొన్ని settings ల ద్వారా కొంతవరకు ఆపవచ్చు ...



Facebook Security మరియు Privacy Settings గురించి:




పోస్ట్ లు ఎవరు చూడాలో ( public,Friends,Only me,Custom) Set చేసుకోవాలంటే .... 
పైన ఉన్న Gear icon క్లిక్ చేసి , Account Settings లోకి వెళ్ళాలి . తర్వాత ఎడమ పక్క Privacy ఆప్షన్ పైన క్లిక్ చేస్తే Who can see my stuff? చూపబడుతాయి . Who can see my stuff? లో Who can see your future posts? లో public,Friends,Only me,Custom ఆప్షన్స్ ని select చేసుకోవడం ద్వారా చేయవచ్చు .
మన time line లో ఇతరుల Tag చేసిన post  లు  రివ్యూ చేసి పోస్ట్ చేసుకోవాలంటే ...
 Account Settings లోకి వెళ్ళాలి . తర్వాత ఎడమ పక్క Privacy ఆప్షన్ పైన క్లిక్ చేస్తే Who can see my stuff? చూపబడుతాయి. Review all your posts and things you're tagged in పైన క్లిక్ చేసి approve చేసుకోవచ్చు  .
మనం చేసిన Old పోస్ట్ లు కొందరికి(friends , Tag chesina friends) తో మాత్రమే share చేసుకోవాలంటే ...
Account Settings లోకి వెళ్ళాలి . తర్వాత ఎడమ పక్క Privacy ఆప్షన్ పైన క్లిక్ చేస్తే Who can see my stuff? చూపబడుతాయి. Limit the audience for posts ... click చేసి Confirm చేయాలి .
Friend Request లు Restrict చేయాలంటే ...
Account Settings లోకి వెళ్ళాలి . తర్వాత ఎడమ పక్క Privacy ఆప్షన్ పైన క్లిక్ చేస్తే Who can contact me? లో Who can send you friend requests? క్లిక్ చేసి Everyone / Friend of Friends select చేయాలి.
facebook లో search చేసినపుడు  ( మీ మొబైల్ నెంబర్ లేక ఈమెయిలు తో ) profile కనిపించకుండా చేయాలంటే ..
Who can look me up? లోని ఆప్షన్స్ ని మార్చడం ద్వారా Restrict చేయవచ్చు . 


search engine లో మన profile లింక్ కాకుండా , search చేసినపుడు కనిపించకుండా చేయాలంటే ...

Account Settings లోకి వెళ్ళాలి . తర్వాత ఎడమ పక్క Privacy ఆప్షన్ పైన క్లిక్ చేస్తే Who can look me up?లో Do you want other search engines to link to your timeline? check బటన్ Uncheck చేయడం ద్వారా చేయవచ్చు .

మన time line లో ఇతరుల పోస్ట్ చేయకుండా మరియు Tag చేయకుండా చేయాలంటే , మన timeline లో పోస్ట్ లు ఇతరులు చూడకుండా చేయాలంటే ..

Account Settings లోకి వెళ్ళాలి . తర్వాత ఎడమ పక్క Privacy ఆప్షన్ పైన క్లిక్ చేసి 
Timeline and Tagging  లో ఆప్షన్స్ set చేసుకోవాలి.

Blocking user ఆప్షన్ ద్వారా user ని Block చేసిన తర్వాత మనం timeline లో postings చూసే  అవకాశం లేదు . 
ఇదేవిదం గా Users నుండి Apps , Events invite , Public users ద్వారా Apps invites Block చేసేయవచ్చు.
Account Settings లోకి వెళ్ళాలి . తర్వాత ఎడమ పక్క Blocking ఆప్షన్ పైన క్లిక్ చేసి Blocking ఆప్షన్స్ set చేసుకోవాలి.

------------------------------------------------------------------------------------------------------------------------

Security Settings:


Secure (HTTPS) Connection: Secure Connectionవుపయోగించనపుడు , facebook ని బ్రౌజరు లో ఓపెన్ చేస్తున్నప్పుడు మన user name మరియు password సంబందించిన వివరాలు cookie లో save అవడం ద్వారా Hacker లకు మన సమాచారం దొంగిలించేందుకు వీలుగా వుంటుంది . Secure (HTTPS) Connection సెట్టింగ్ ద్వారా user name మరియు password సంబందించిన వివరాలు Encrypt చేయబడి మన వివరాలు సురక్షితం గా ఉంచుకోవచ్చు . దీనికోసం ...

పైన ఉన్న Gear icon క్లిక్ చేసి , Account Settings లోకి వెళ్ళాలి . తర్వాత ఎడమ పక్క Security ఆప్షన్ పైన క్లిక్ చేస్తే Security Settings చూపబడుతాయి . Security Settings లో Secure Browsing లో Edit పైన క్లిక్ చేసి Browse Facebook on a secure connection (https) when possible check బాక్స్ ని select చేసి save చేయాలి .
Facebook లో మన Login ఎప్పుడెప్పుడు చేసామో వివరాలు మనకు తెలియాలంటే  ( మొబైల్ లేక మెయిల్ కు  )
Account Settings > Security (ఎడమ పక్క)>  Security Settings > Login Notifications లో Email లేక Text message/Push notification check బాక్స్ ని select చేసి save చేయాలి .
Facebook లో మనం కొన్ని Apps ని add చేసుకొంటూ ఉంటాము ( Ex : Skype,Xbox..). వాటిని Access చేసే సమయం లో కొన్ని సంర్బాలలో password లేకుండానే access అయిపోతుంటాయి . అలా కాకుండా Password set చేసుకోవాలంటే ....
Account Settings > Security (ఎడమ పక్క)>  Security Settings > App Passwords లో Generate app passwords పైన క్లిక్ చేసి password ఇచ్చి save చేయాలి . 
Account login సమయం లో login problem వచ్చినప్పుడు మీ స్నేహితుల సహాయం ద్వారా మీ ఎకౌంటు ని మళ్ళీ యదావిదిగా access చేసుకోవచ్చు . ఈ ఆప్షన్ set చేసుకోవడం ద్వారా మీ ఫ్రెండ్స్ కి సెక్యూరిటీ code పంపబడుతుంది . దానిని ఉపయోగించుకొని facebook లో సూచనలను అనుసరించి తిరిగి పొందవచ్చు.
Account Settings > Security (ఎడమ పక్క)>  Security Settings > Trusted Contacts open చేసి ముగ్గురు ఫ్రెండ్స్ ని Add చేయాలి .

Post a Comment