WHAT'S NEW?
Loading...

Windows 7 USB DVD Download Tool మీ USB drive ని recognize చేయలేకపోతుందా ?


మీ కంప్యూటర్ లో విండోస్ 7 / 8 / 8.1 ని USB drive ని Bootable గ చేసి Install చేసుకొందామనుకొంటున్నారా ?
అయితే ఈ విదంగా చేసుకోవచ్చు. విండోస్ 7 / 8 USB Drive తో ఇన్స్టాల్ చేసుకోండి  
ఇలా చేసే ముందుగా మనం USB drive Ready చేసుకొని దానిని Windows 7 USB DVD Download Tool సహాయం తో Bootable గా తాయారుచేసుకొంటాము కదా ? తయారు చేసే క్రమం లో Windows 7 USB DVD Download Tool ని ఓపెన్ చేసి , విండోస్  7 / 8 / 8.1 ISO ఫైల్ ని ఎంచుకొని , తర్వాత USB device ని ఎంచుకొంటాము ... అప్పుడు USB device recognize చేయకుంటే ఎలా ??? ( కానీ Tool నుండి కాకుండా బయట USB బాగానే పనిచేస్తున్నప్పుడు ) . కొన్ని USB drive లతో  ( Ex : SanDisk కంపెనీ USB లలో ఈ Problem ఎక్కువగా వస్తుంది ) ఇలాంటి Problems వస్తుంటాయి . అలాంటి సమయం లో , అటువంటి సమస్యలకు పరిష్కారం వుంటే బావుంటుంది కదా ? దానికోసమే ఈ క్రింద చెప్పబడిన RUFUS టూల్ అద్బుతం గా పనిచేస్తుంది .... ఎలా పనిచేస్తుందో చూద్దామా ?
  • ముందుగా Rufus టూల్ ని క్రింది బటన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.

  • టూల్ ని ఓపెన్ చేసి తర్వాత USB drive recognize చేయబడుతుంది .
  • మీకు కావాల్సిన file system, Cluster size ( Default ) , Format options లో కావలసిన option ఎంచుకోవాలి 
  • .ISO file నుండి bootable చేయడానికి ISO Image ప్రక్కన వున్న Icon click చేసి కంప్యూటర్ లో save చేయబడివున్న ISO file ఎంచుకోవాలి .
  • Start బటన్ పైన click చేయడం ద్వారా USB drive లో files copy చేయబడి , USB bootable గ తయారుకాబడుతుంది.

ఈ Rufus software  UNetbootin, Universal USB Installer or Windows 7 USB download tool ల కన్నా వేగం గా పనిచేస్తుంది.

Post a Comment